అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యత - ఆధ్యాత్మిక ప్రయాణం
స్వామియే శరణం అయ్యప్ప! స్వామీ
మాలధారులకు,
భక్తులకు, మరియు ఆధ్యాత్మికతలో ఆసక్తి ఉన్న
ప్రతి ఒక్కరికీ స్వాగతం! ఈ ఎపిసోడ్‌లో, మనం
అయ్యప్ప దీక్ష యొక్క విశిష్టతను, దీని
పద్ధతులను, ఆధ్యాత్మిక ప్రయాణంలో దీని
ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. మీకు దీక్ష పట్ల అవగాహన కలిగించి, భక్తిని మరింతగా పెంచేందుకు దీనిని రూపొందించాం!”
అయ్యప్ప దీక్ష:
హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకూ శబరిగిరుల్లో వెలసిన శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుని అయ్యప్ప మాల ధరించి స్వామిని దర్శించుకుంటారు.
41 రోజుల పాటు( 1 మండలం) కఠినమైన నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు ఈ సమయం లో నల్లని పంచలు, మెడ లో రుద్రాక్ష మాలలు, నుదుట గంధం విభూది తో మనకు అయ్యప్ప భక్తులు కనిపిస్తారు. 41 రోజుల దీక్ష తీస్కోని, అయ్యప్ప ని పూజించే భక్తులను మనం "స్వామి " గా సంభోదిస్తాం. మన శరీరం మరియు మనస్సు 41 రోజులపాటు శిక్షణ పొంది ఒక దినచర్యతో ప్రారంభమై తర్వాత సాధారణ అలవాటుగా మారుతుంది.
మన అలవాట్లు మన ప్రవర్తనగా మారతాయి మరియు మన ప్రవర్తనమన పాత్రగామారుతుంది. కాబట్టి ఒక వ్యక్తి దీక్ష తీసుకుంటూ, అన్ని నియమాలను పాటిస్తే మంచి జరుగుతుంది మరియు సమాజానికి మేలు జరుగుతుంది.
ఒక వ్యక్తి నిజంగా దీక్ష యొక్క అన్ని నియమాలను అనుసరిస్తే లోపల నుండి రూపాంతరం చెందుతాడు. స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉంటే, అహంకారము నశిస్తుంది మరియు ఎక్కడ అహంకారము నశించునో, అక్కడ దైవత్వం ప్రతిబింబిస్తుంది.
ఈ దీక్షలో ఉండే వారు రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసల మాలల ధరిస్తారు. ఇవి శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం. శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడం తో ఈ దీక్ష ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగు, ఆర్భాటాలు, లేకుండా సామాన్య జీవన గడపడం మనకూ అలవడుతుంది.
మనం జుట్టు కత్తిరించడం , గడ్డం గొరుగుట చేయకూడదు, గోళ్లు కత్తిరించకూడదు, శని దోషం ప్రభావం ఎవరి జీవితంలోనైనా కష్టాలు, అడ్డంకులు, మరియు బాధలు తెస్తుందని అందరికీ తెలుసు. కాని అయ్యప్ప స్వామికి శనిపై నియంత్రణ ఉంది. భక్తుల శ్రద్ధను మరియు భక్తిని చూసి అయ్యప్ప స్వామి, శని భగవానుడికి తన భక్తులపై శని దోషం ప్రభావం రాకుండా నిలవాలని కోరతాడు.
అయ్యప్పస్వామివారు శని దేవునికి ఇచ్చిన మాట కారణంగా ఈ
నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే, దీక్ష తీసుకొన్న వారు తమ అహంకారాన్ని జయించి, ప్రతి ఒక్కరిని స్వామి రూపంగా చూసి గౌరవంగా
స్వీకరించాలి.
ఈ దివ్య దీక్షను ప్రారంభించడం ద్వారా మనలో ఉన్న నైతిక విలువలను
పెంపొందించుకోవచ్చు. మరింత ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోవడానికి మరుసటి
ఎపిసోడ్ కూడా చూడండి!”
అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి
ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది. శరీరానికి ఉండే పేరు, వాటి కోసం ధరించే దుస్తులు,
తీసుకునే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలు, దినచర్య అంతా అయ్యప్ప
దీక్ష చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని
అంతర్థానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో ‘స్వామి’ అని
పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు.
ఈ అయ్యప్ప దీక్ష అనునది మళయాళ నెలల లో
వృశ్చికం ( నవంబర్ 14/15/16 ) నుండి మొదలవుతుంది. మండల పూజ ( సుమారు25 dec ), మకర సంక్రాంతి
( సుమారు 14jan ) ఈ రెండు రోజలలో అయ్యప్ప స్వామి దర్శనం చేస్కొంటారు. ఈ రెండు రోజలలో
మకర సంక్రాంతి రోజు దర్శనం ప్రదానమైనది. ఆ రోజు జ్యోతి దర్శనం జరుగుతుంది. జ్యోతి రూపం
లో అయ్యప్ప భక్తులకు దర్శనం ఇస్తారు.
శబరిమల ఆలయం, మళయాళ నూతన సంవత్సర మొదటి రోజు, ప్రధాన
పండగల రోజు తెరుస్తారు. ఉదా : ఓనం, విశు. 41రోజుల దీక్ష తప్పనిసరిగా తీస్కొని అయ్యప్ప
దర్శనం చేయవలెను. ఈ అయ్యప్ప దీక్ష అనునది తల్లి ద్వారా కానీ, గురువుగారి ద్వారా కాని,
గురుస్వామి ద్వారా కానితీస్కొనవలెను.
ఆ రుద్రాక్ష మాల
మెడలో పడిన దగ్గర నుండి " స్వామి " అని అందరి చేత పిలువబడుతాడు.
అమ్మాయిలు ఈ దీక్ష తీసుకోడానికి నిబంధనలు
ఉన్నాయి. అమ్మాయి 1 -9 వయస్సు లోపు వారు, 50 వయస్సు దాటినా వారు దీక్షకు అర్హులు. దీక్ష
తీసుకొన్న ఆడువారిని "మాలికాపురం" గా “మాత” గా పిలుస్తారు.
శరీరానికి, మనస్సుకు శిక్షణ - దీక్ష పద్ధతులు
దీక్ష
తీసుకొన్న వారు ఖచ్చితంగా నియమ నిభంధనలను పాటించాలి. తెల్లవారక ముందే లేచి,
చన్నీటి స్నానం చేసి, శరణు ఘోష చేసి, నైవేద్యం పెట్టాలి.
క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వల్ల సంఘజీవనానికి బాటలు వేస్తుంది. దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
మనం మధ్యాహ్నం నిద్రపోకూడదు.బ్రహ్మచర్యం తప్పకుండ పాటించాలి. వేరే వారిని పిలిచేటప్పుడు కూడా స్వామి అనే సంభోదించాలి.
నాకు తెలిసిన దీక్షకు సంబంధించిన సూత్రాలు ఇవిఈ నియామాలు పాటించకుండా శబరిమల దర్శనం వ్యర్ధం. " ఓం హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప "
